పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అరెస్ట్‌

Published on Wed, 07/24/2024 - 19:55

సోషల్‌ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్‌తో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్‌ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్‌ సింగ్‌ (19) డ్రైవింగ్‌ చేస్తుండగా.. స్పైడర్‌ మ్యాన్‌ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.

దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్‌ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. 

ప్రమాదకర డ్రైవింగ్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు  పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్‌ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)