Breaking News

Video: పెళ్లి ఊరేగింపులో బంధువుల రచ్చ.. గాల్లోకి 20 లక్షలు జల్లుతూ

Published on Wed, 11/20/2024 - 11:03

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. పెళ్లిని ఎవరైనా జీవితంలో గుర్తిండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అతిథులందరి సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకుంటారు. అయితే ఒక చోట మాత్రం కొందరు పెళ్లి ఊరేగింపులో హల్‌చల్‌ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు.

దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. గాలిలో దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.  కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి కాల్‌ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు   స్పందించలేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు