Breaking News

వీడియో వైరల్‌: మంచుకొండల్లో అరుదైన క్షణాలు..

Published on Fri, 01/30/2026 - 16:15

ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన  ఈ ఘటనను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్‌ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.

ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)