Breaking News

రాహుల్‌ రాజ్యాంగ వ్యతిరేకి: ధన్‌ఖడ్‌

Published on Mon, 09/16/2024 - 04:58

ముంబై : రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. ఆయనది రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వమని విమర్శించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు రాజ్యాంగ స్వరూపం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యాంగంపై అందరికీ అవగాహన అత్యవసరం’’ అని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు.

 ‘‘రాజ్యాంగమున్నది డాంబికంగా ప్రదర్శించడానికి కాదు. దాన్ని గౌరవించాలి. అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. బాధ్యత కలిగిన, తెలివున్న, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తీ ఇలా ప్రవర్తించరు’’ అంటూ రాహుల్‌పై నిప్పులు చెరిగారు. ఇటువంటి దుస్సాహాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగ పదవిలో వ్యక్తి రిజర్వేషన్లను ఎత్తేయాలని విదేశీ గడ్డపై మాట్లాడటం రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి బహుశా ఆయనకు వారసత్వంగా అబ్బింది’’ అంటూ దుయ్యబట్టారు. రిజర్వేషన్లున్నది సమాజానికి మూలస్తంభాల్లాంటి సామాజిక వర్గాలకు చేయూతనిచ్చేందుకేనని ధన్‌ఖడ్‌ స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)