Breaking News

ఏఆర్‌ రెహమాన్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Published on Sat, 01/17/2026 - 13:48

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్‌ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్‌ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. 

అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్‌ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్‌లో అవకాశాలు దక్కాలంటే ఘర్‌వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు.

.. హమీద్‌ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్‌ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్‌వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్‌ అన్నారు.  ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్‌లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.

ఓ ప్రముఖ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్‌సైడర్‌లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు.  

మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్‌మేకర్‌ రెహమాన్ వ్యాఖ్యలను చీప్‌ అని పేర్కొన్నారు.    

అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్‌ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్‌ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)