Breaking News

బుర్ఖాతో వచ్చినా.. ముఖం చూపించాలి

Published on Sun, 01/11/2026 - 06:01

వారణాసి: మాస్క్, ముసుగు, బుర్ఖా, హెల్మెట్‌ వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు నగలను విక్రయించరాదని యూపీలోని వారణాసి జిల్లా నగల దుకాణదారుల సంఘం నిర్ణయించింది. ఇటీవల పలు జిల్లాల్లో బుర్ఖా, ముసుగులతో వచ్చిన చోరులు దుకాణాల్లో నగలను దోచుకోవడం, మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ మేరకు నిషేధం విధించినట్లు యూపీ జువెల్లర్స్‌ అసోసియేషన్‌(యూపీజేఏ) వారణాసి జిల్లా అధ్యక్షుడు కమల్‌ సింగ్‌ చెప్పారు.

 ‘ముఖాన్ని కప్పుకుని దుకాణానికి వచ్చే వినియోగదారులకు నగలను విక్రయించం. ముఖాన్ని కప్పుకుని వచ్చే వారు ఏదైనా నేరానికి పాల్పడితే, గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోంది. అందుకే, మేం మాస్క్, బుర్ఖా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చే వారికి నగలను అమ్మబోమంటూ దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశాం. ఇదంతా మా భద్రత కోసం మాత్రమే. ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు’అని అన్నారు.

ఇకపై కొనుగోలుదారు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ఆచ్ఛాదనాన్ని తప్పనిసరిగా తొలగించాకనే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఆ కొనుగోలుదారు గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. ఇలాంటి నిషేధం యూపీలోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీజేఏ అధ్యక్షుడు సత్య నారాయణ్‌ సేథ్‌ చెప్పారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)