శరన్నవరాత్రులకు వజ్రేశ్వరి దేవి ముస్తాబు

Published on Tue, 10/01/2024 - 11:55

థానే: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలలో వజ్రేశ్వరి దేవి ఆలయం ఒకటి. నవరాత్రులలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు.  

వజ్రేశ్వరి దేవి ఆలయం మహారాష్ట్రలోని వజ్రేశ్వరిలో ఉంది. ఈ నగరం ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చిమాజీ అప్పా పేష్వా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారని చరిత్రకారులు అంటుంటారు. పిడుగుపాటు నుండి మాతా వజ్రేశ్వరి దేవి ప్రత్యక్షమై పలువురు రాక్షసులను అంతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో వజ్రేశ్వరి దేవితో పాటు రేణుకా మాత, కాళికా మాత, మహాలక్ష్మి  అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి.

వజ్రేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఒక వేడి నీటి చెరువు ఉంది. దీనిలో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని స్థానికులు చెబుతుంటారు. నవరాత్రులలో ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెరువులో  స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ సౌందర్యం నవరాత్రులలో మరింత శోభాయమానంగా మారుతుంది. వజ్రేశ్వరిదేవి ఆలయానికి చేరుకోవాలంటే 52 మెట్లు ఎక్కాలి. నవరాత్రుల సమయంలో ఈ మెట్లను వేల రకాల పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు.

నవరాత్రులలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సాయంత్రం హారతి సమయంలో ప్రాంగణం అత్యంత రద్దీగా మారుతుంది. వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ముంబైకి చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ సాయంతో ఆలయానికి రావచ్చు. మహారాష్ట్రలోని థానే నగరం నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)