Breaking News

ధర్నాకు దిగిన వైష్ణోదేవి భక్తులు 

Published on Mon, 09/15/2025 - 06:38

కత్రా/జమ్మూ: త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్‌ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన యాత్రికులు, భక్తులు ధర్మాగ్రహం వెలిబుచ్చారు. 

దేవీదర్శనం కోసం సుదూరాల నుంచి వచ్చాక తీరా త్రికూల పర్వతాల వద్ద హఠాత్తుగా ఆపేసి, యాత్రకు అర్థంతరంగా రద్దుచేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆదివారం రేసీ జిల్లాలోని కత్రా బేస్‌క్యాంప్‌ వద్ద పెద్దసంఖ్యలో యాత్రికులు నిరసన చేపట్టారు. ఆలయం దిశగా ర్యాలీగా వెళ్తేందుకు భక్తులు ప్రయతి్నంచగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయబోర్డ్‌ ఆదేశాలను ఉల్లంఘించడానికి వీల్లేదని పోలీసులు తెగేసి చెప్పారు. 

ఆలయానికి దారితీసే ప్రధాన ఘాట్‌రోడ్డు, దానికి అనుసంధానమైన రహదారుల వెంట భారీ వర్షాలు, పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిన పడటంతో మొత్తం ఘటనల్లో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైష్ణోదేవి ఆలయ బోర్డ్‌ ఆగస్ట్‌ 26వ తేదీన యాత్రను నిలిపేసింది. అప్పటి నుంచి యాత్ర ఆగిపోయి ఆదివారానికి వరసగా 20 రోజులు పూర్తయింది. 

సెపె్టంబర్‌ 14వ తేదీన యాత్రను పునరుద్ధరిస్తామని గతంలోప్రకటించినా ఆదివారం(సెప్టెంబర్‌ 14న) అది మొదలుకాలేదు. దీంతో రోజులతరబడి వేచి ఉండే ఓపికలేక భక్తుల్లో అసహనం, ఆగ్రహం పెల్లుబికింది. ‘‘రెండు నెలలపాటు పాదరక్షల్లేకుండా కాలినడకన కత్రా బేస్‌క్యాంప్‌దాకా వచ్చా. వీలైనంత త్వరగా దర్శనభాగ్యం దక్కుతుందని ఆశపడుతున్నా. పెద్దగుంపులుగా జనానఇన పంపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే చిన్న గుంపులుగా అయినా యాత్రను మొదలెడతే బాగుంటుంది’’అని మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన రాజీవ్‌ లోధీ అనే భక్తుడు అన్నారు. 

‘‘19 రోజలతర్వాత 14వ తేదీన యాత్ర మొదలుకానుందని తెల్సి తమిళనాడు నుంచి కుటుంబంతో వచ్చా. తీరాచూస్తే యాత్ర పునరుద్ధరణ వాయిదాపడింది. మా క్షేమం కోరి యాత్రను ఆపేశారని తెలుసు. కానీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో తెలీట్లేదు’’అని చెన్నైవాసి వినోద్‌కుమార్‌ అన్నారు. ‘‘ఏదేమైనా యాత్ర పూర్తిచేస్తాం. సస్పెండ్‌చేసే ఉద్దేశమే ఉంటే ఆన్‌లైన్‌ రిజి్రõÙ్టషన్‌ ఎందుకు మొదలెట్టారు?’అని ముంబై నుంచి వచి్చన రేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనం చేసుకున్నాక వెనుతిరుగుతామని బిహార్‌ వాసి రాజ్‌కుమార్‌ స్పష్టంచేశారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)