Breaking News

పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?

Published on Tue, 12/23/2025 - 20:00

ప్రస్తుతం కాంగ్రెస్  పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్‌ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.

రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆ‍మెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.

అదే సమయంలో  "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్‌ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. 

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)