Breaking News

ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్‌

Published on Sat, 05/04/2024 - 13:26

వడపావ్‌  అమ్ముతున్న యువతిని అరెస్ట్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను పోలీసులు ఖండించారు. వ‌డాపావ్ గ‌ర్ల్‌గా ఫేమ‌స్ అయిన చంద్రిక దీక్షిత్‌ను అరెస్టు చేయ‌లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేగాక ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.

చంద్రిక దీక్షిత్‌ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో వడపామ్‌ ఫుడ్‌ స్టాల్‌ నడిపిస్తోంది. రాను రాను ఆమె ‘వడపామ్‌ గర్ల్‌’గా పేరొందింది.  ఆమెకు ఇన్‌స్టాలో 30 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇటీవల ఈ యువతి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్‌ దగ్గర యువతి విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వివాదం జరిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.  స్టాల్‌ను తొల‌గించాల‌ని ఆదేశించిన మున్సిప‌ల్ అధికారుల‌తో ఆమె గొడ‌వ‌కు దిగింది. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది.

అయితే, చంద్రిక ఫుడ్ స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం వల్ల ఆమె స్టాల్‌ వద్దకు జనాలు భారీగా వస్తున్నారని. దీని వల్ల స్థానికంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో  వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల వారు తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

దీంతో  పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి, ఆమెను పోలీస్ స్టేషన్‌ తరలించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆమెను అరెస్ట్‌ చేయలేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని  తెలిపారు.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)