Breaking News

UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!

Published on Sat, 12/27/2025 - 11:34

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.

ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపధ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. లక్నో పరిధిలోని మలిహాబాద్, మోహన్‌లాల్‌గంజ్ తదితర నియోజకవర్గాల్లో 83 శాతం మంది దరఖాస్తులు సమర్పించగా, లక్నో కంటోన్మెంట్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల సంఘం తగిన సమయాన్ని కేటాయించింది.

ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 31న ప్రకటించనున్న ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 2026, జనవరి 30లోపు ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. తుది ఓటర్ల జాబితాను 2026, ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ భారీ మార్పులు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి: మక్కాలో కలకలం.. వీడియో వైరల్

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)