Breaking News

17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?

Published on Sun, 09/07/2025 - 16:58

హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్‌ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.

కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో  ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)