Breaking News

అడవిలో అమెరికన్‌ మహిళ.. కేసులో కొత్త ట్విస్ట్‌

Published on Tue, 08/06/2024 - 12:27

ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో  అమెరికాకు చెందిన ఓ మహిళను గొలుసులతో కట్టేసిన ఘటనలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పోలీసుల వాంగ్మూలంలో అమెరికన్ మహిళ తనకు తాను సంకెళ్లు వేసుకున్నానని, మరెవరి ప్రమేయం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.  

జులై 27 న సింధుదుర్గ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతమైన సోనుర్లి గ్రామ శివార్లలో ఇనుప గొలుసులతో మహిళను చెట్టుకు కట్టేశారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన పశువు కాపరికి మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. దీంతో పశువుల కాపరి అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టేసిన గొలుసుల్ని విడిపించారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

వైద్య పరీక్షల అనంతరం ఆమె పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం (ఆగస్టు 3) సింధుదుర్గ్ పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసులతో ముంబై నుంచి 460 కిలోమీటర్ల దూరంలోని సోనుర్లి గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు, తాను అక్కడనున్న ఓ చెట్టుకు కట్టుకున్నట్లు తెలిపారు. ఆమెను ఎన్ని రోజులు చెట్టుకు కట్టివేసిందనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు.

ఇక మహిళ వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా.. ఆమె బ్యాగ్‌లో  అమెరికా పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డ్‌, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆమెను తమిళనాడుకు చెందిన లలితా కయీగా గుర్తించిన పోలీసులు..తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తదిపరి విచారణ కొనసాగుతోంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)