Breaking News

యూఎస్ మ‌హిళను బురిడి.. 300 విలువ చేసే న‌గ‌ల‌ను రూ. 6 కోట్ల‌కు అమ్మి

Published on Tue, 06/11/2024 - 15:32

విదేశీ మ‌హిళ‌ను ఓ న‌గ‌ల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్య‌మైన బంగారు న‌గ‌ల‌పేరుతో ఒక‌టి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయ‌ల‌ దోపిడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘోరం రాజ‌స్థాన్‌లో వెలుగుచూసింది. వివ‌రాలు..

అమెరికాకు చెందిన చెరిష్ అనే మ‌హిళ  జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం య‌జ‌మాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్ష‌రాల రూ. 6 కోట్లు వెచ్చించింది.  

డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జ‌రిగిన ఎగ్జిబిష‌న్‌లో ఆ ఆభ‌ర‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ క్ర‌మంలో అవి న‌కిలీవ‌ని తేలింది. వాటి విలువ కేవ‌లం రూ. 300 మాత్ర‌మేన‌ని తెలిసి షాక్‌కు గురైంది. వెంట‌నే స‌ద‌రు మ‌హిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిల‌దీసింది.

అయితే దుకాణం యాజ‌మాని  ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసుల‌కు  ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.

కాగా 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్ర‌స్తుతం గౌర‌వ్‌, అత‌ని తండ్రి రాజేంద్ర సోనీ ప‌రారీలో ఉండ‌గా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్ద‌రి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)