Breaking News

‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ!

Published on Sat, 06/13/2026 - 10:34

న్యూఢిల్లీ: అమెరికాలో ఒక దశాబ్దానికి పైగా విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపి, హెచ్‌ వన్‌ బీ వీసా గడువు ముగియడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఒక భారతీయ ఐటీ నిపుణుడి (టెక్కీ) సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశానికి వస్తే.. సొంత గడ్డపై ఆనందంగా గడపాల్సింది పోయి, ఇక్కడి వాతావరణం, మౌలిక వసతులకు అలవాటు పడలేక తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నానంటూ సదరు టెక్కీ ప్రముఖ సామాజిక మాధ్యమం ‘రెడిట్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. భారతదేశంలోని రోజువారీ సమస్యల నుంచి తప్పించుకుని, చట్టబద్ధంగా మళ్లీ ఏదైనా ఇతర విదేశానికి ఎలా వెళ్లాలో చెప్పాలంటూ నెటిజన్ల సహాయాన్ని కోరాడు.

రివర్స్ కల్చర్ షాక్: టెక్కీని వేధిస్తున్న సమస్యలు
అమెరికాలో 13 ఏళ్లు నివసించిన తాను, ప్రస్తుతం భారతదేశంలోని టైర్-2 నగరంలో స్థిరపడినట్లు ఆ టెక్కీ పేర్కొన్నాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుండి ‘రివర్స్ కల్చర్ షాక్’ ఎదుర్కొంటున్నానని వాపోయాడు. రోజుకు కనీసం  ఎనిమిది గంటల పాటు విపరీతమైన కరెంట్ కోతలు, తట్టుకోలేని వేసవి ఎండలు, దోమల బెడద, అస్తవ్యస్తమైన ట్రాఫిక్, అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యత  కారణంగా తన జీవితం నరకప్రాయంగా మారిపోయిందని, పూర్తిగా అలసిపోయానని ఆవేదన వెళ్లగక్కాడు. డబ్బులు ఉన్నా సరే ఇక్కడ జీవితం దారుణంగా ఉంటుందని, పనిమనుషులతో గొడవలు, కల్తీ ఆహారం, నాణ్యత లేని వస్తువులతో బతకడం నరకమని వ్యాఖ్యానించాడు.

వీసా కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
తనకు ఇప్పటికే మాస్టర్స్ డిగ్రీతో పాటు ఐటీ రంగంలో అనుభవం ఉన్నందున, మళ్లీ పాత పద్ధతిలో ఎఫ్‌ వన్‌ స్టూడెంట్ వీసా ద్వారా అమెరికా వెళ్లడం గానీ, సాధారణ హెచ్‌ వన్‌ బీ లాటరీ సిస్టమ్‌లో పాల్గొనడం గానీ తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. పశ్చిమ దేశాలలో శాశ్వత పౌరసత్వం పొందేందుకు ఐటీ నిపుణులకు ఉన్న ఇతర వీసా మార్గాలు లేదా వ్యూహాలు ఏమిటని నెటిజన్లను అడిగాడు. సాధారణ లాటరీ విధానంతో సంబంధం లేకుండా చట్టబద్ధంగా విదేశాలకు వెళ్లేందుకు తక్షణ మార్గాలను సూచించాలని కోరాడు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎండకాలంలో నేరుగా టైర్-2 నగరానికి రావడం వల్లే ఈ సమస్యలని, కొచ్చి లేదా మెట్రో నగరాలైతే బాగుండేదని ఒకరు సూచించగా, కెనడా పీఆర్‌ లేదా పీఎన్‌పీ మార్గాలను ప్రయత్నించాలని మరికొందరు సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతం కెనడాలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని, శీతాకాలం చాలా ఘోరంగా ఉంటుందని హెచ్చరించారు. పశ్చిమ దేశాల్లో ఉద్యోగాలు సాధించాలంటే నెట్‌వర్కింగ్ పెంచుకోవడమే ఏకైక మార్గమని సీనియర్లు సూచించారు.

ఇది కూడా చదవండి: భారత్‌లో మళ్లీ ‘కుష్టు’ బీభత్సం.. 91 వేలు దాటిన కొత్త కేసులు!

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)