Breaking News

మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు

Published on Sun, 04/16/2023 - 15:06

ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ నమ్మశక్యం కాని గొప్ప దార్శనికుడని, భారత ప్రజల పట్ల ఆయన నిబద్ధత వర్ణించలేనిదని ప్రశంసించారు. ఈ మేరకు రైమోండో ఇండియా హౌస్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది భారత్‌లో జరిగిన హోలీ వేడుకలలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయ వేడుకల పరంగా భారత్‌ చాలా అత్యుత్తమమైనదన్నారు.

తాను ఈ హోలీ వేడుకల్లో పాల్గొనడం కోసమే ఒక రోజు ముందుగా భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు.‍ కృత్రిమ మేధలో వస్తున్న విప్లవాన్ని భారత్‌-అమెరికాలు ముందుండి నడిపిస్తాయని చెప్పారు. అలాగే అక్కడ ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని కూడా వివరించారు. ​ప్రధాని మోదీతో గంటన్నరసేపు గడపడం తనకు లభించిన అద్భుతమైన గొప్ప అవకాశమన్నారు.

అతను అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడు, నమ్మశక్యంకాని దూరదృష్టిగలవాడంటూ పొగడ్తల జల్లు కురిపించారు. అందుకు సంబంధించిన వీడియోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌, యూఎస్‌లు అంతరిక్షం, రక్షణ, సెమీకండక్టర్లు, వంటి సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి.  

(చదవండి: అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్‌ ధర)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)