Breaking News

ఏరో షోలో అమెరికా బాంబర్‌ జెట్‌ బీ1బీ

Published on Wed, 02/15/2023 - 06:03

బెంగళూరు: బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా గగనతలంలో ప్రత్యేక అతిథి వచ్చి చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్‌ బాంబర్‌ జెట్‌ మంగళవారం బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్‌ వినువీధులో వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్‌’ అని పిలుస్తారు.

‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్‌ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ జూలియన్‌ చీటర్‌ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్‌ అడ్మిరల్‌ మైఖేల్‌ బేకర్‌ అన్నారు. కాగా, సోమవారం అమెరికా ఐదోతరం సూపర్‌సోనిక్‌ ఎఫ్‌–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకున్న విషయం విది తమే. ఎఫ్‌35ఏ భారత్‌లో ల్యాండ్‌ అవడం ఇదే తొలిసారికావడం విశేషం. బీ–1బీ బాంబర్‌ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు