Breaking News

విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్‌ షాక్‌కు గురై యువకుడి మృతి

Published on Tue, 07/23/2024 - 20:06

న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి  విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్‌ రాజ్‌గా గుర్తించారు. పటేల్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

వివరాలు.. నీలేష్‌ రాజ్‌ అనే యువకుడు పటేల్‌ నగర్‌ హాస్టల్‌లో ఉంటూ  సివిల్స్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్‌ విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్‌ పాస్‌ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్‌ను వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్‌కు కరెంట్‌​ ఎలా పాస్‌ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా  ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)