‘ఆపరేషన్‌ సిందూర్‌తో చెక్‌మేట్‌.. భారత్‌​ సత్తా పాక్‌ ప్రజలకు తెలుసు’

Published on Sun, 08/10/2025 - 08:59

మద్రాస్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చర్య పాత్రను ఆపరేషన్ సిందూర్ నొక్కిచెబుతుందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో తాము చెస్‌లో పావుల మాదిరిగా శత్రువుల కదిలికలు తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఐఐటీ మద్రాస్‌లోని అగ్నిశోధ్-ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC)ను ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆపరేషన్ సిందూర్ అంశంపై జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు.‘ఆపరేషన్ సిందూర్‌లో మేం చెస్ గేమ్‌ ఆడాం. శత్రువు తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. మేం ఏం చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు. మనం చెస్ గేమ్‌లో పావుల్లా ముందుకు సాగాం. శత్రువు అంచనా వేయలేని విధంగా దాడులు చేశాం. పాకిస్తాన్‌, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి అని చెప్పుకొచ్చారు. 

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 23వ తేదీన మరుసటి రోజే మేమందరం సమావేశం అయ్యాం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలు చాలు అని చెప్పడం ఇదే మొదటిసారి. ముగ్గురు చీఫ్‌లు ఏదో ఒకటి చేయాలని చాలా స్పష్టంగా ఉన్నారు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అనే స్వేచ్ఛ ఇచ్చారు. అదే మా మనోధైర్యాన్ని పెంచింది అని చెప్పారు. 25వ తేదీన నార్తర్న్ కమాండ్‌ను సందర్శించాం. అక్కడ మేం తొమ్మిది లక్ష్యాలను నాశనం చేశాం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఏప్రిల్ 29న మేం మొదటిసారి ప్రధానమంత్రిని కలిశాము. ఆపరేషన్ సిందూర్​ అనే చిన్న పేరు మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది’ అని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌పై భారత్‌ గెలిచిందా లేక ఓడిందా అనే విషయం పాకిస్తానీలను అడిగితే బాగా చెబుతారు అని చెప్పుకొచ్చారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)