Breaking News

కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే.. 

Published on Sat, 07/08/2023 - 12:46

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి ఏకంగా ఎమ్మెల్యే సీటులోనే కూర్చున్నాడు. సభలోని ఓ ఎమ్మెల్యే అతడిని అనుమానించి  భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. 

కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు అసెంబ్లీలోకి చొరబడటంతో అక్కడి భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం చట్టాలను తయారు చేసే చట్టసభలను దేవాలయాలుగా పరిగణిస్తూ ఉంటాం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు మాత్రమే అందులో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అటువంటి చోటుకి సామాన్యులు వెళ్లడమంటే మాటలు కాదు.

అలాంటిది అక్కడి భద్రతా వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ లోపలికి చొరబడటమే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాడు ఓ ఆగంతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొలకాల్మోర్ నియోజకవర్గంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 70 ఏళ్ల తిప్పేరుద్రప్ప అలియాస్ కరియప్ప మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి వచ్చి అక్కడి సెక్యూరిటీ వారికి తనని తాను ఒక ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని లోపలికి ఎంటరయ్యాడన్నారు. 

అసెంబ్లీ లోపల దేవదుర్గ జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీటులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రకటిస్తుండగా 15 నిముషాల పాటు బడ్జెట్ సమావేశాలను తిలకించాడని, పక్కన ఉన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యేకి అతడిపై అనుమానం రావడంతో అక్కడి సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా వారు అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే అతడు అసెంబ్లీలోకి చొరబడినట్లు తెలిపారు పోలీసులు.  

ఇది కూడా చదవండి: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)