Breaking News

అమిత్‌ షాకు అస్వస్థత.. హోటల్‌లోనే చికిత్స!

Published on Sat, 09/19/2026 - 16:44

బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థకు గురయ్యారు. ఈ రోజు ( శనివారం) ఉదయం ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. అమిత్‌షా  రాక కోసం ప్రజలంతా ఎదురుచూస్తుండగా ఆయన అస్వస్థకు గురయ్యారని కార్యక్రమానికి హాజరుకాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.

కర్ణాటక హుబ్లీలో కేఎల్‌ఈ ఆసుపత్రి, మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ని ఈ రోజు శనివారం అమిత్‌షా ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కర్ణాటకాకు అమిత్‌షా చేరుకుని హోటలలో బస చేశారు. అయితే ఈ రోజు 11 గంటలకు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. దీంతో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు కళాశాల సిబ్బంది ఆయన  రాక కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంతో ఆయన అస్వస్థకు గురయ్యారని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.

అస్వస్థతకు గురై హోటల్‌లోనే వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నాడని వర్గాలు తెలిపాయి. అమిత్‌షా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, ఇరన్న కడాడి, మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యేలు సీసీ పాటిల్ తదితరులు ఆయనను పరామర్శించారు.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)