Breaking News

ప్రజలు కోరింది ఇవ్వకుంటే ఓట్లెలా వేస్తారు?

Published on Mon, 12/29/2025 - 06:26

అహ్మదాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. 

మంత్రి అమిత్‌ షా ఆదివారం అహ్మదాబాద్‌ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్‌ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్‌ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్‌ షా అన్నారు. 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్‌ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్‌ 370 రద్దును, ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్‌ షా పేర్కొన్నారు. 
 

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)