Breaking News

పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్‌ కీలక సమావేశం

Published on Tue, 05/06/2025 - 17:10

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్‌ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం  జరగనుంది. 

ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్‌ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.

ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్‌ విషయంలో భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్‌ సమావేశం జరగనుంది. 

అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్‌ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా  ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు  ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అజిత్‌ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్‌  కమిటీ (సీసీఎస్‌) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్‌ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్‌ తీసుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)