Breaking News

ఆ దేశంలో ఉద్యోగాల పేరిట దారుణ మోసం: కేంద్రం కీలక ప్రకటన

Published on Fri, 03/08/2024 - 19:08

ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్‌ ఏజెంట్‌ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన అస్వాన్‌.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్‌ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. 

మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్‌ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)