Breaking News

13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం

Published on Sat, 06/28/2025 - 04:45

త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్‌ నేవీ యుద్ధ విమానం ఎఫ్‌–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్‌ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్‌ బ్రిటీష్‌ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్‌ స్నాగ్‌ కారణంగా ఉండిపోయిన ఎఫ్‌–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్‌ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది.

 ఫైటర్‌ జెట్‌ను భారత్‌లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్‌ కోసం బ్రిటన్‌ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్‌–35బి జూన్‌ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్‌కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. 

కానీ హైడ్రాలిక్‌ వైఫల్యంతో జెట్‌ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్‌ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్‌–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్‌లోని బ్రిటిష్‌ హైకమిషన్‌ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్‌ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. 

జోరుగా మీమ్స్‌ 
బ్రిటన్‌ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్‌లైన్‌లో జోరుగా మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్‌ను కేవలం 4 కోట్లకే ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్‌కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్‌ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్‌ వైరలవుతున్నాయి.  
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)