Breaking News

Jammu & Kashmir: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి

Published on Wed, 10/21/2026 - 10:58

ఉధంపూర్‌: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బస్సు లోయలో పడింది. పేచౌండ్ నుంచి రామ్‌నగర్ వెళ్తున్న ఈ బస్సు గుల్లీ గాలా ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెండగా,15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే బస్సు లోయలో పడినట్లు ప్రాథమిక సమాచారం.
 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ అనంత్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం, గాలా పచౌండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ్‌నగర్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ‘బొద్దింక’ దహనంపై ‘ఆప్‌’ ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)