Breaking News

దమ్ముంటే రాజకీయంగా అంతం చేయండి 

Published on Sat, 06/21/2025 - 05:18

ముంబై:  మహారాష్ట్రలోని శివసేనలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాల్‌ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ శివసేన (ఉద్ధవ్‌), శివసేన(షిండే)గా చీలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబైలో శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవంలో శివసేన(ఉద్ధవ్‌) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రసంగించారు. ఠాక్రే బ్రాండ్‌ను ధ్వంసం చేసేందుకు బీజేపీతోపాటు ఏక్‌నాథ్‌ షిండే కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు. 

1991లో విడుదలైన ప్రహార్‌ చిత్రంలోని నానా పటేకర్‌ డైలాగ్‌ను గుర్తుచేస్తూ, ‘‘మీకు దమ్ముంటే నన్ను రాజకీయంగా అంతం చేయండి’’అని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కానీ, వెంటనే హాస్యధోరణిలోకి వెళ్లిపోయారు. ‘‘నన్ను చంపడానికి రండి. కానీ, అంబులెన్స్‌ కూడా వెంట తెచ్చుకోండి. ఎందుకంటే దాని అవసరం మీకే ఉంటుంది’’అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. మరాఠీ పార్టీల్లో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు.

 ఠాక్రే బ్రాండ్‌ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఠాక్రే సవాల్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన(షిండే) చీఫ్‌ ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. ఉద్ధవ్‌ ఠాక్రేను ప్రజలు రాజకీయంగా ఎప్పుడో అంతం చేశారని, కొత్తగా చేయడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. సింహం చర్మం కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ సింహం కాలేదని స్పష్టంచేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే చాలెంజ్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం స్పందించారు. ఉత్తుత్తి కబుర్లు చెప్పేవారి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు.   
 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)