Breaking News

14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ

Published on Thu, 02/01/2024 - 11:06

సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్‌లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో నిర్మితమయ్యింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్‌లోని బీఏపీఎస్‌లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్‌లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్‌ జాయెద్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 

2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)