Breaking News

Jammu & Kashmir: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, తొమ్మిది మందికి తీవ్రగాయాలు

Published on Tue, 06/24/2025 - 13:11

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చట్ట్యారి-చింగస్ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం  చోటుచేసుకుంది. రాజౌరి పట్టణం నుండి జమ్ముకు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ఒక మినీ గూడ్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో తునాతునకలైందని పోలీసులు తెలిపారు.

మృతులను ఖోత్రా నివాసి ఇన్షా ఫాతిమా (26), ఫతేపూర్‌కు చెందిన ఫర్జాండ్ బేగం (50)గా గుర్తించారు. వీరిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాయపడిన వారిలో మృతురాలు ఫర్జాండ్ బేగం భర్త మహ్మద్ ఇక్బాల్, వారి కుమార్తె రఫియా ఇక్బాల్ ఉన్నారు.  క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఏడుగురిని రాజౌరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, ఇద్దరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు ప్రమాదానికి  గల కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)