Breaking News

‘తుర్క్‌మన్‌ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు

Published on Thu, 01/08/2026 - 11:36

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసుకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎంపీ మోహిబుల్లా నద్వీకి దర్యాప్తులో పాల్గొనాలంటూ పోలీసులు నోటీసులు పంపనున్నారు. హింస జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ఘర్షణ వెనుక ఆయన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్‌మన్‌ గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎంసీడీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున చర్యలు చేపట్టారు. అయితే మసీదును కూల్చివేస్తున్నారనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో,  వందలాది మంది ప్రజలు  అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, భాష్పవాయువును ప్రయోగించారు. ప్రస్తుతం  పరిస్థితి అదుపులో ఉందని సోలీసు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘మిఠాయిల రాజధాని’ ఎక్కడ?.. ఏ స్వీట్‌కు ఐజీ ట్యాగ్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)