Breaking News

‘ఆగస్టు ఒకటిన మాకు డబ్బే డబ్బు’: ట్రంప్‌‌ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 07/17/2025 - 07:44

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఆగస్టు  ఒకటి తమకు ఒక ముఖ్యమైన రోజు కానున్నదని, ఆ రోజున తమ దేశానికి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని  ట్రంప్‌ పేర్కొన్నారు.

భారతదేశంతో తాము కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెబుతూనే, దీనిపై భారతదేశం- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆ సమావేశంలో తెలిపారు. ఆగస్టు  ఒకటిన తమ దేశానికి  గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్‌ ప్రకటించారు.  ఇప్పడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, అది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.  వారికి తాము ఒప్పందానికి సంబంధించి, ఒక లేఖ పంపామని తెలిపారు. భారతదేశంతో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.

భారత మార్కెట్లకు  లబ్ధి చేకూర్చే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని అన్నారు. కాగా భారత్‌- అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం ఐదవ రౌండ్ చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు ఏఎన్‌ఐకి తెలిపారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)