Breaking News

త్రిపుర డీజీపీ ఆత్మహత్య 

Published on Mon, 07/20/2026 - 13:50

అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) అనురాగ్‌ ఠాకూర్‌(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్‌ బాత్‌రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రకటించారు. ఠాకూర్‌ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్‌ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్‌ ఠాకూర్‌ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

 ‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్‌ ఠాకూర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ ఆస్పత్రి మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ డాక్టర్‌ ప్రదీప్‌ భౌమిక్‌ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్‌ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన అనురాగ్‌ ఠాకూర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్‌ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది.

 

 కాగా, రాష్ట్ర పోలీస్‌ చీఫ్‌ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్‌ ఐపీఎస్‌ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్‌ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్‌ చేశారు. డీజీపీ అనురాగ్‌ ఠాకూర్‌ మరణంపై మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అభిõÙక్‌ దేబ్‌రాయ్‌ తెలిపారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)