ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

Published on Mon, 06/22/2026 - 16:20

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీటా సోషల్ మీడియా పోస్ట్‌ నెట్టింట ఆడవాళ్ల బట్టలపై చర్చను లేవనెత్తింది. భారతీయ మహిళలు బీచ్‌కు వెళ్లి, స్విమ్‌సూట్ లేదా బికినీలో వేలకొద్దీ ఫోటోలు తీసుకున్నా, వాటిని ఫోన్‌ మెమోరీలోదాచుకోవడం తప్ప, సోషల్‌ మీడియాలో  ఎందుకు పోస్ట్‌ చేయరు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ ఎలా కామెంట్ చేస్తుంది? ఆ వీడియో లేదా ఫోటో చూసి మిమ్మల్ని అవమానకరమైన పేర్లతో పిలిస్తే? అని భయం వెంటాడుతుంది అంటూనే  కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం అగ్గి రాజేసింది.

తాను కూడా బికీనీలు వేసుకుని ఫోటోలు దిగినా, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టనని రీటా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే భారత్‌లో ఉన్న 24 ఏళ్ల జీవితం తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో,దుస్తుల విషయంలోఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిందన్నారు. కానీ భయపడుతూ, ఎన్నాళ్లుంటాం అని ప్రశ్నించింది.  అందుకే తన మైండ్‌ సెట్‌ మార్చుకుని ఈ ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నా అన్నారు.

‘‘ఒక భారతీయ మహిళగా ఇలాంటి వీడియోను పోస్ట్‌ చేస్తానని తానెపుడూ అనుకోలేదు. అలా అని నేనెపుడూ బికినీ వేసుకోలేదని కాదు. థాయ్‌లాండ్ , ఇండోనేషియాలో చాలాసార్లు బికినీ ధరించా. అక్కడ బీచ్‌లలో ఇది చాలా కామన్‌. అయితే పూర్తిగా దుస్తులు కప్పుకున్నప్పుడు కూడా, ఏదో ఒకటి విమర్శిస్తారు. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూనే ఉంటారు. సో.. జనం ఏదో అంటారనే రెండో ఆలోచన కూడా చేయకుండా తాను ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా’’ అని చెప్పింది.

 

బికీనీలో ఫోటో పెడితే ఏమవుతుందని చాలా కాలం ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా అక్కడ తగ్గట్టు ఉండాలని గ్రహించాను. నేను ఫరీదాబాద్‌లో బికీనీ వేసుకోను కదా, బీచ్‌లోనే వేసుకుంటాను. అలాగే  బీచ్‌కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకోలేము కదా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఇండియన్‌ అంకుల్స్ కేవలం షార్ట్స్ వేసుకుని, సరిగ్గా స్విమ్‌సూట్ కూడా లేకుండానే సముద్రాలు, పూల్స్‌లోకి దిగుతుంటారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో తాను బికీనీ వేసుకున్నప్పుడు అక్కడెవరూ తనను వింతగా చూడలేదని,  ఎవరి పని వారు చూసుకుంటారని రీటా చెప్పారు.   

నిజానికి మన భయమంతా సమాజం గురించే. చిన్నప్పటి నుండి మనకు అలవాటు చేసిన ఆలోచనా విధానం వల్లే వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను మాట్లాడేది కేవలం బికీనీల గురించి కాదు, మన బాడీతో కంఫర్టబుల్‌గా ఉండటం, భయంతో మన ఫీలింగ్స్‌ను అనుభవాలను కోల్పోకపోవడం గురించి అని చెప్పారు.

ఈ వీడియోపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది  ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను జడ్జ్‌ చేస్తూ, నానా మాటలు అన్నారు. ‘నీ బాడీ. నీ యిష్టం’ అని కొందరు మహిళలు ఆమెను సమర్ధించారు. థాయిలాండ్‌లో గుడ్లప్పగించి చూడకపోవడం వల్ల స్వేచ్ఛగా ఫీలవుతాం అంటూ చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలిపారు. 

ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

మహిళల దుస్తుల ఎంపికను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సంకుచిత స్వభావం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. మహిళలు ఏం వేసుకోవాలో నియంత్రించే కంటే,ఇలాంటి పురుషాధిక్య, వివక్షతోకూడిన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.

రీటాను విమర్శించిన వారిలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. ఈమెకు దూరంగా ఉండండి అని కొందరంటే, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా కాపీ కొడుతూ, మళ్లీ దానికి సమర్థన ఒకటి అని మండిపడ్డారు. పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులకున్నట్టు కాదు మరికొరు విమర్శించారు. 

ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)