Breaking News

అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్‌

Published on Mon, 07/15/2024 - 19:27

ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ..  ట్రెయినీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పూజా ఖేద్కర్‌ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. 

శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్‌.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్‌ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్‌ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. 

ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. 

నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్‌ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)