Breaking News

రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి ట్రక్కు.. ఇంతలో వేగంగా రైలు రావడంతో..

Published on Fri, 03/14/2025 - 10:02

జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్‌లో రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. జల్గావ్‌ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోధుమల బస్తాలతో నిండిన ఒక ట్రక్కు కాపలా లేని రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రక్‌పైకి అంబా ఎక్స్‌ప్రెస్‌ వేగంగా వచ్చింది. అది ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో టక్కు తునాతునకలయ్యింది. ఆ ట్రక్కులోని కొంతభాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది.  

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో మధ్య రైల్వేకు చెందిన ముంబై-కోల్‌కతా మార్గం(Mumbai-Kolkata route)లోని ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిక్‌ వైరు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం ఈ మార్గంలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు డ్రైవర్‌ రైల్వే నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

ఇది కూడా చదవండి: Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్‌ రౌండ్‌’ అంటూ..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)