Breaking News

Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..

Published on Tue, 11/11/2025 - 11:06

న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన 22 ఏళ్ల నౌమాన్ కూడా ఉన్నాడు. షామ్లీలోని జింఝానకు చెందిన నౌమాన్ తాను నిర్వహిస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం కోసం సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో అతనిని మృత్యువు కబళించింది.

నౌమాన్ కుటుంబ సభ్యులకు ఈ వార్త తెలియగానే వారంతా కుంగిపోయారు. మంగళవారం ఉదయం వారు లోక్‌ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో నౌమాన్‌తో పాటు ఉన్న అతని బంధువు 21 ఏళ్ల అమన్ కూడా పేలుడులో గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం గౌరీ శంకర్ ఆలయం నుండి బైక్‌పై తిరిగి వస్తున్న 28 ఏళ్ల అంకుష్ శర్మ , 20 ఏళ్ల రాహుల్ కౌశిక్ సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అంకుష్‌ ముఖం, శరీరం 80 శాతం మేరకు తీవ్రంగా కాలిపోయింది.

ఈ పేలుడులో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు.  అంతటి బాధలోనూ అతను అంకుష్‌ను ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డాడు. ఆస్పత్రి వెలుపల బాధితుల కుటుంబాలు గుమిగూడి, తమవారి కోసం వెదుకుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన హ్యుందాయ్ కారు ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద పేలిపోయింది. దీంతో సమీపంలోని పలు వాహనాలు తునాతునకలయ్యాయి. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)