Breaking News

భారత్‌లో టమాటో ఫ్లూ కలకలం...హెచ్చరించిన లాన్సెట్‌ నివేదిక

Published on Sat, 08/20/2022 - 15:25

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు.

దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్‌ రెస్పిరేటరీ జర్నల్‌ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్‌ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది.

ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్‌గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్‌లోని మరే ప్రాంతాలు ఈ వైరస్‌ బారిన పడలేదని లాన్సెట్‌ నివేదిక పేర్కొంది.

(చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం)

Videos

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)