తమిళనాడుకు భారీ వర్ష సూచన.. మిగిలిన రాష్ట్రాల్లో..

Published on Sun, 10/13/2024 - 08:21

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా  వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గడచిన 24 గంటల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 

ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)