Breaking News

ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్‌లో కురుస్తున్న మంచు

Published on Mon, 12/02/2024 - 09:08

న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.

పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్‌లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్‌లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. గుల్‌మార్గ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో  ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)