Breaking News

విజయ్‌ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్‌ కోడ్‌ గుర్తింపుతో..

Published on Tue, 12/09/2025 - 07:22

సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్‌ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్‌ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్‌ సోమవారం  ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు.

 పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్‌ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. 

శాంతిభద్రతల పరిరక్షణకు.. 
పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్‌ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్‌ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. 

అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్‌ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్‌ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో  అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్‌ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్‌ పేర్కొంటూ, టీవీకే  ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో  ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది.   

ఈరోడ్‌లో విజయ్‌ ర్యాలీకి పోలీసులు నో

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు