Breaking News

‘ఆమె తల్లిదండ్రుల్ని అనవసరంగా లాగొద్దు’

Published on Thu, 09/05/2024 - 21:16

కోల్‌కతా: ఆర్జీ కర్‌ హాస్పిటర్‌ జూనియర్  డాక్టర్‌ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అ‍సత్య ప్రచారం చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు. 

‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్‌ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. 

.. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను  ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా  వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్‌ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె. 

‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ  ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్‌డేట్లు ప్రెస్‌మీట్‌ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)