Breaking News

టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!

Published on Wed, 06/10/2026 - 09:13

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్‌ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.

ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్‌లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.

అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్‌గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.

టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.

మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)