Breaking News

‘ఎన్నికల జాబితా’పై సుప్రీంకు మొయిత్రా 

Published on Mon, 07/07/2025 - 05:56

కోల్‌కతా: బిహార్‌లోని యువ ఓటర్లకు ఓటు లేకుండా చేసేందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు పూనుకుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బిహార్‌ తర్వాత ఈసీ తదుపరి లక్ష్యం 2026లో ఎన్నికలు జరిగే బెంగాల్‌ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యకు నిరసనగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లోని నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950కి విరుద్ధంగా ఉన్నాయి మహువా పేర్కొన్నారు. 

వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ఈసీ ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలను ఈసీ జారీ చేయకుండా చూడాలని కోరానన్నారు. 1987 జూలై 1–2004 డిసెంబర్‌ 2వ తేదీల మధ్య జని్మంచిన వారు ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ కారణంగా ఓటేసే హక్కుకు లక్షలాది మంది దూరమవుతారని ఆరోపించారు. 

బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను అమలు చేయాలంటూ ఈసీ జూన్‌ 24వ తేదీన ఆదేశాలు జారీ చేయడం తెల్సిందే. అనర్హులను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూడటమే ఈ ఆదేశాల లక్ష్యమని ఈసీ అంటోంది. ఈసీ ఆదేశాలపై ఏడీఆర్, పీయూసీఎల్‌ వంటి పౌర సంఘాలు, కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ అమలుకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని ఈసీ ఆదివారం స్పష్టం చేసింది.  
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)