Breaking News

కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే శ్వేతపత్రం 

Published on Sun, 01/18/2026 - 05:00

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌లో పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, అవినీతిపరులు స్వాహా చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన మొత్తం నిధుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించగలరా? అని మోదీకి సవాలు విసిరింది. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది. 

2021 నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని పేర్కొంది. ‘‘రాజకీయ పర్యాటకుడు నరేంద్ర మోదీ బెంగాల్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా?  అయితే, పీఎం ఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి దక్కాల్సిన రూ.24,275 కోట్ల నిధులు ఇవ్వకుండా ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలి’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పీఎం ఆవాస్‌ యోజన పథకాన్ని కొనసాగించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలియజేసింది. బీజేపీ వాషింగ్‌ మిషన్‌గా మారినట్లు తృణమూల్‌ విమర్శించింది. అవినీ తిపరులు ఆ పార్టీలో చేరగానే పరిశుద్ధులు అయిపోతున్నారని ఎద్దేవా చేసింది.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు