Breaking News

పరువు నష్టం నేరం కాదు: సుప్రీం కోర్టు వ్యాఖ్య

Published on Tue, 09/23/2025 - 06:59

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల(Defamation Cases)ను నేరరహి తంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు ‘ది వైర్‌’అనే ఆన్‌లైన్‌ పబ్లికేషన్‌ సంస్థపై పరువు నష్టం కేసు వేశారు(The Wire Defamation Case). ఈ మేరకు మేజిస్ట్రేట్‌ కోర్టు ది వైర్‌కు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు దానిని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ‘ది వైర్‌’వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌(Justice MM Sundaresh).. ‘ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్థారించాల్సిన సమయం వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ది వైర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ దీనిని సమర్థిస్తూ సంబంధిత చట్టంలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసర ముందన్నారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్‌ 499 ప్రకారం పరువునష్టం కలిగించడం నేరం కాగా, దీనినే భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) కూడా సెక్షన్‌ 356గా కొనసాగించింది. 

అయితే, న్యాయ మూర్తి సుందరేశ్‌ వ్యాఖ్యలు 2016లో సుబ్రమణ్య స్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగబద్థత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే, గౌరవం పొందే ప్రాథమిక హక్కు కిందకు ఇది వస్తుందని తెలిపింది. 

ఇదీ చదవండి: కొందరు జడ్జిలు సరిగా పని చేయట్లేదు!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)