Breaking News

నేటి పార్లమెంట్‌లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు

Published on Thu, 11/28/2024 - 08:32

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్‌, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్‌సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.

ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్‌ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్‌  కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.

బీహర్‌ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)