Breaking News

కాటేసిన కలుషిత నీరు

Published on Wed, 12/31/2025 - 05:31

ఇండోర్‌(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్‌ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్‌ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్‌ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్‌ మెడికల్, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాధవ్‌ ప్రసాద్‌ హసానీ చెప్పారు.

మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్‌ మేయర్‌ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్‌ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్‌ జిల్లాలోని జలూద్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)