Breaking News

మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published on Tue, 11/04/2025 - 09:13

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో సోమవారం రాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్ - మోవ్ మధ్య సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి  తరలిస్తుండగా మృతి చెండాడు. తొమ్మిది మంది క్షతగాత్రులను ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
 

బస్సు ఓంకారేశ్వర్ నుండి ఇండోర్‌కు వెళుతుండగా పెద్ద గుంతలో బోల్తా పడిందని జిల్లా కలెక్టర్ శివం వర్మ మీడియాకు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదంపై ‘ఎక్స్‌’లో స్పందిస్తూ, ఇది హృదయ విదారక ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల  చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్‌ 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)