Breaking News

ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు

Published on Sat, 07/04/2026 - 18:18

ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.. ఆసీస్‌ పర్యటనకు ముందు మోదీకి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆ దేశ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్న క్రమంలో.. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ వచ్చిన వార్నింగ్‌పై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జులై 9న మార్వెల్ స్టేడియంలో జరగాల్సిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ (Melbourne Meets Modi) కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్ కింద ఈ బెదిరింపు కామెంట్ ప్రత్యక్షమైంది. అబు ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుండి వచ్చిన ఆ కామెంట్‌లో  ‘ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ (AFP)కి ఫిర్యాదు అందినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.

ఈ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్‌ను ర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు.. మెల్‌బోర్న్ సమావేశంతో సహా పలు కమ్యూనిటీ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నారు. పర్యటనకు వచ్చే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనల భద్రతా ప్రణాళికలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, స్పెషలిస్ట్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు సంస్థలు భాగస్వామ్యమవుతాయి.

 

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?