Breaking News

కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో చోరీ.. ముసుగులతో వచ్చి.. వీడియో వైరల్

Published on Sun, 09/07/2025 - 08:08

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్‌లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.

ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)